'పాత విధానంలోనే కొనసాగించాలి'
ASR: ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని సీపీఎం పార్టీ అరకు మండల కార్యదర్శి కిండంగి రామారావు డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో ముఖ హాజరును రద్దు చేయాలని కోరారు. ఈమేరకు బుధవారం అరకు మండలం పెదగంగుడి గ్రామంలో జరిగిన గ్రామ సభలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. వేతనదారులు రెండు పూటలా ముఖ హాజరు వేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.