సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు
KNR: కరీంనగర్ ఇందిరా చౌక్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(డీసీసీ అధ్యక్షులు), మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తలు భారీ కేక్‌ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు.