సీఎంఆర్ఎఫ్ పేదలకు అండ: ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ పేదలకు అండ: ఎమ్మెల్యే

NLG: ఆపదలో ఉన్నపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో సుబ్బారెడ్డిగూడెంకు చెందిన తెల్లబోయిన రాములమ్మకు రూ.36 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటికే వందలాది మందికి ఈ నిధి చేరిందని, పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.