బీజేపీ జిల్లా అధ్యక్షుడు అరెస్టు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు అరెస్టు

HNK: కాంగ్రెస్ పాలన నుంచి హైదరాబాద్‌ను రక్షించాలనే నినాదంతో సచివాలయం ముట్టడి కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హన్మకొండ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డిని సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని సంతోశ్ రెడ్డి తెలిపారు