VIDEO: అనంతపురంలో 15న ర్యాలీ
ATP: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న (సోమవారం) అనంతపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు.