'RMS స్కూల్‌కు జిల్లా విద్యార్థి ఎంపిక కావడం గర్వకారణం'
అన్నమయ్య: రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ (ఆర్ఎంఎస్) పరీక్షల్లో రాయచోటి విద్యార్థి పణి రామ్ వర్మ అద్భుత ప్రతిభ కనబరిచింది. 150కి 138 మార్కులు సాధించి దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ ర్యాంకు పొందిన విద్యార్థినిని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం అభినందించారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఆర్ఎంఎస్ స్కూల్‌కు రాయచోటి విద్యార్థి ఎంపిక కావడం గర్వకారణమని మంత్రి కొనియాడారు.