భీమవరంలో ఉచిత వివాహ పరిచయ వేదిక

భీమవరంలో ఉచిత వివాహ పరిచయ వేదిక

W.G: భీమవరం వన్ టౌన్ పరిధిలోని కామాక్షమ్మ ఆలయం వద్ద గల విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి విశ్వకర్మ సామాజికవర్గ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బంధాలను బలపరచడంతో పాటు పేద కుటుంబాలకు ఈ వేదిక ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఫౌండేషన్ ఛైర్మన్ రవీంద్ర ఆచారి పేర్కొన్నారు.