'బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి'

'బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి'

JGL: బడి ఈడుకు వచ్చిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సర్పంచ్ చెక్కపల్లి స్వాతి అన్నారు. భీమారం మండల కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు.