'కార్మికుల వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలి'
AKP: భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును తక్షణం పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ రామకృష్ణ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంపై శుక్రవారం రాంబిల్లి మండలం పెదకలువలాపల్లిలో కరపత్రాలు ద్వారా ప్రచారం నిర్వహించారు.