కాశీబుగ్గ తొక్కిసలాటపై మంత్రి సత్యకుమార్ దిగ్భ్రాంతి
SS: కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.