స్వామివారిని దర్శించుకున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే
WGL: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు వర్ధన్నపేట ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా కలకాలం ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు.