నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

NRML: జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు లింగన్న తెలిపారు. హైదరాబాద్‌లో గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.