పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు తిరుపతికి తరలింపు

పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు తిరుపతికి తరలింపు

CTR: పలమనేరు అటవీశాఖ పరిధిలో స్వాధీనం చేసిన ఎర్రచందనం దుంగలను అధికారులు బుధవారం తిరుపతి గోడౌన్‌కు తరలించారు. బైరెడ్డిపల్లిలోని ఓ ఇంట్లో భారీ ఎత్తున పట్టుబడ్డ దుంగలు, నెల్లిపట్ల అడవిలో అక్రమంగా తరలిస్తుండగా వదిలిపెట్టిన దుంగలు కలిసి మొత్తం 146 దుంగలను గోడౌన్‌కు మార్చినట్లు తెలిపారు. అక్రమ రవాణాపై దాడులు కొనసాగిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.