అమ్మాయితో లైవ్ వీడియో కాల్.. క్లిక్ చేస్తే..!
MDCL: మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన నర్రా వినయ్ అనే ఓ వ్యక్తికి గుర్తుతెలియని ఓ నెంబర్ నుంచి ఓ లింకు వచ్చింది. రూ.40కే అమ్మాయితో లైవ్ వీడియో కాల్ మాట్లాడొచ్చని, ఇందుకోసం లింకు క్లిక్ చేయాలని మెసేజ్‌లో ఉంది. దీంతో సదరు వ్యక్తి లింక్ క్లిక్ చేయగా, అమ్మాయి కాల్ లిఫ్ట్ చేసి వెంటనే కట్ చేసింది. అంతే సంగతి.. వెంటనే అకౌంట్లో ఉన్న రూ.8,457 కట్ అయ్యాయి.