స్మశానానికి స్థలం కేటాయించాలి: సీపీఎం

నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలోని మజార గ్రామమైన బాబూజీ నగర్‌కు స్మశాన స్థలం కేటాయించి, గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి బాల వెంకట్ డిమాండ్ చేశారు. మంగళవారం నంద్యాల తహాశీల్దార్ కార్యాలయంలో తహాశీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. త్వరతగతిన స్మశానానికి స్థలం కేటాయించాలని కోరారు.