'బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి'

NGKL: ఇందిరా క్రాంతి పథకంలో పనిచేసే ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శనివారం అమ్రాబాద్ మండల కేంద్రంలోని వెలుగు సమాఖ్య సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో వీవోఏలు ఇంటింటికి తిరిగి మహిళలను సంఘంలో చేర్చాలన్నారు.