పరిమితికి మించి ఆవుల తరలింపు.. కేసు నమోదు

పరిమితికి మించి ఆవుల తరలింపు.. కేసు నమోదు

MNCL: బెల్లంపల్లి మండల కేంద్రంలో ఆవులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు SI రామకృష్ణ తెలిపారు. బుధవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరోలో 7 ఆవులు, 1 కోడెను బంధించి వాటికి త్రాగడానికి నీరు, గడ్డి లేకుండా క్రూరంగా పరిమితికి మించి తీసుకెళ్తుండగా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆవులను గోశాలకు తరలించి వారిపై కేసు నమోదు చేశామన్నారు.