చేగుంటలో పనుల జాతరకు శ్రీకారం

చేగుంటలో పనుల జాతరకు శ్రీకారం

MDK: చేగుంట మండలంలోని 28 గ్రామ పంచాయతీలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల జాతర -2025 లకు శ్రీకారం చుట్టినట్లు ఎంపీడీవో చిన్నారెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలో గత సంవత్సరం చేపట్టిన పనులకు ప్రారంభోత్సవం, నూతనంగా చేపట్టనున్న పనులకు శంకుస్థాపనలు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో శ్వేత, గ్రామస్తులు పాల్గొన్నారు.