మనవడు దేవాన్ష్‌కు చంద్రబాబు అభినందనలు

AP: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న దేవాన్ష్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. గురువుల మార్గనిర్దేశంలో నెలలపాటు కష్టపడి ఈ ఘనత సాధించాడని చెప్పారు. 175 పజిల్స్‌లో ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్ రికార్డు పట్ల గర్విస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. తమ లిటిల్ ఛాంపియన్ దేవాన్ష్‌కు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.