ఐ బొమ్మ రవిపై ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
MBNR: ఐ బొమ్మ రవి విషయంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆసక్తికరంగా స్పందించారు. రవిని కొందరు రాబిన్ హుడ్‌లా భావిస్తున్నారన్నారు. అయితే సినిమా వాళ్లు అధిక టికెట్ ధరల భారాన్ని ప్రజలపైనే మోపుతున్నారని ఆయన విమర్శించారు. వేల కోట్లతో సినిమాలు తీసినా లాభం పొందేది నిర్మాతలు, దర్శకులు, హీరోలే తప్ప సాధారణ ప్రేక్షకులకు ప్రయోజనం లేదని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.