కృష్ణానదిలో స్నానం సమయంలో బాలుడు మృతి

GNTR: తాడేపల్లిలోని కృష్ణానదిలో స్నానం చేస్తున్న సమయంలో నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన 14ఏళ్ల మురారి అనే బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. 3రోజుల క్రితం కుటుంబంతోపాటు పిరమిడ్ ధ్యానకేంద్రం వద్దకు వచ్చిన బాలుడు నిన్న సాయంత్రం నదిలో దిగిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని మంగళగిరి ఆసుపత్రికి తరలించగా, తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.