మహిళా పోలీసుల సేవలు భేష్..!

మహిళా పోలీసుల సేవలు భేష్..!

మేడ్చల్: సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మౌలాలి రైల్వే స్టేషన్ వద్ద రైళ్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధులకు మహిళా పోలీసులు చెయ్యందిస్తున్నారు. వారిని జాగ్రత్తగా రైలులో ఎక్కించే బాధ్యతను చేపట్టారు. మహిళా పోలీసులు చేస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు. రైలు రద్దీగా ఉన్న సమయాల్లో చిన్న పిల్లలకు సైతం సహాయం అందిస్తున్నారు.