ఈనెల 20న సాధారణ సర్వసభ్య సమావేశం
VSP: పద్మనాభం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈనెల 20వ తేదీన సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి ఎంపిడిఓ నగేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమవుతుందన్నారు. అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. ప్రజా ప్రతినిధులు తదితరులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.