సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన యువకుడు
MHBD: గూడూరు మండలం కోమటిపల్లి తండాకు చెందిన ధరంసోత్ రవికుమార్ ఇవాళ స్థానికంగా ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. పలువురు వ్యక్తులు తన ఇంటికి దారి లేకుండా చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించాడు. పోలీసులు చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాని ఆయన అన్నాడు. విషయం తెలుసుకున్న గూడూరు SI రవిని దించే ప్రయత్నం చేశాడు.