మిషన్ భగీరథ పైపు లీకేజి.. రోడ్డుపైకి తాగునీరు వృథా
MLG: కన్నాయిగూడెం మండలంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజి కారణంగా తాగునీరు భారీగా వృథా అవుతోంది. మండల విద్యా వనరుల కేంద్రం (MRC) ముందు ప్రధాన పైపులో లీకేజి ఏర్పడి నీరు రోడ్డుపైకి పొంగిపొర్లుతోంది. కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ సమస్యతో రహదారి దెబ్బతిని పరిసరాలు మురికిగా మారాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.