రూ. 30 లక్షల న‌గ‌దు పట్టివేత

రూ. 30 లక్షల న‌గ‌దు పట్టివేత

మెద‌క్: మ‌క్క‌రాజుపేట‌లో రూ. 30లక్షల న‌గ‌దును పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ మండలం దాచారానికి చెందిన దంపతులు డబ్బులు తీసుకొని బైక్‌పై వెళ్తున్నారు. పంచాయతీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, పట్టుబడడంతో నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అయితే అవి పొలం అమ్మిన డ‌బ్బులు అని దంపతులు సమాధానం ఇచ్చారు.