ప్రజా సమస్యలు పరిష్కారం కాని మీకోసం ఎందుకు?

ASR: ప్రజా సమస్యలు పరిష్కారం కాని మీకోసం కార్యక్రమం ఎందుకని ఆదివాసీ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంతల నాగేశ్వరరావు ప్రశ్నించారు. శుక్రవారం పాడేరు ఐటీడీఏ ఎదుట నిరసన తెలిపారు. ఐటీడీఏ నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు తెలియజేసినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మీకోసంలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించాలని కోరారు.