గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు
VZM: కొత్తవలస కంటకాపల్లి రైలు పట్టాల మధ్య గుర్తు తెలియని మృతదేహం గుర్తించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఆశోక్ శుక్రవారం తెలిపారు. మృతుడు 5 అడుగుల 6 అంగుళాల పొడవు, చామనచాయ రంగులో ఉన్నట్లు చెప్పారు. తెలుపు రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్, నీలంరంగు జీన్ ప్యాంటు ధరించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9490617089ను సంప్రదించాలని కోరారు.