మునగాలలో ముగిసిన వృత్తి నైపుణ్య శిక్షణ
SRPT: మునగాల మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలకు చెందిన 30 మంది ఇంటర్ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ శిక్షణ శుక్రవారం ముగిసింది. శిక్షణలో భాగంగా మీడియా & ఎంటర్టైన్‌మెంట్, హెల్త్ కేర్ కోర్సులలో 10 రోజులపాటు ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ అందించినట్లు శిక్షణ నిర్వాహకులు కే. లక్ష్మి, విజయ దుర్గ తెలిపారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు.