మోదీ పర్యటన నిరాశ మిగిల్చింది: సీపీఐ

GNTR: ప్రధాని మోదీ అమరావతి పర్యటన నిరాశపరిచిందని సీపీఐ తాడేపల్లి ప్రాంత కార్యదర్శి కంచర్ల కాశయ్య విమర్శించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతికి నిధుల ప్రకటన చేయకుండా మోదీ ప్రజలను మభ్య పెట్టారని ఆరోపించారు. ఈ పర్యటనతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన అన్నారు.