సంధ్యాసమయంలో కృష్ణా తీరం అందాలు

సంధ్యాసమయంలో కృష్ణా తీరం అందాలు

కృష్ణా: కృష్ణా నదీతీరంలోని నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం వద్ద గురువారం సూర్యాస్తమయం వేళ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. సాయంత్రపు గాలులు, నది అలల తాకిడి, గగనంలో రంగుల వర్ణచిత్రం ఆ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా మార్చాయి. భక్తులు, సందర్శకులు ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ, పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మికతను అనుభవించారు.