దార్శినికుడు జగ్జీవన్ రామ్: ఎంపీ
కృష్ణా: బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు విజయవాడ శిఖామణి సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం కోసం వెనకబడిన వర్గాల కోసం పోరాడిన దార్శినికుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.