పుట్టపర్తికి తరలి వెళ్లిన పారిశుద్ధ కార్మికులు
ATP: గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మరియు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పుట్టపర్తి సత్య సాయిబాబా జన్మదిన వేడుకలకు మంగళవారం తరలి వెళ్లారు. ఈ క్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తిలో సత్యసాయి జన్మదిన వేడుకలకు శానిటేషన్ చేయుటకు పారిశుద్ధ కార్మికులతో కలిసి వెళ్తున్నామన్నారు.