ధాన్యం సేకరణపై సమీక్షా సమావేశం

కృష్ణా: ధాన్యం సేకరణపై కలెక్టర్ డీ.కే. బాలాజీ, జేసీ గీతాంజలి శర్మతో కలసి కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. నవంబర్ మొదటి వారంలో వరి పంట చేతికి రానున్నందున రైతు సేవా కేంద్రాలు, మిల్లర్లు, గోనె సంచులు, రవాణా వాహనాలు, ఎఫ్‌సీఐ గోదాములు అన్నీ సిద్ధంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.