చిమ్మ చీకట్లో నరసన్నపేట ప్రధాన రహదారి

SKLM: నరసన్నపేట ప్రధాన రహదారిలోని వీధిలైట్లు వెలగక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు రోజులుగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కళాశాల జంక్షన్ వరకు వీధిలైట్లు వెలగడం లేదని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన రహదారి చీకటమయంగా మారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.