ఈనెల 28 మెడికల్ కళాశాలలు ప్రవేట్ పరంపై నిరసన ర్యాలీ
VZM: ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆయన క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం విరమించుకోవాలని నినాదంతో ఈనెల 28న నిరసన ర్యాలీ నియోజకవర్గ కేంద్రంలో చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.