772.2 లీటర్ల నాటుసారా ధ్వంసం

మన్యం: జిల్లా ఎస్పీ ఎస్.వి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం పోలీస్ స్టేషన్‌లో 17 నాటుసారా కేసుల్లో పట్టుబడిన 772.2 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంకిత సురనా శుక్రవారం తెలిపారు. నాటుసారా తయారు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందులో పట్టణ సీఐ మురళీధర్, ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.