సాయి సిద్ధార్థ కళాశాలలో రక్తదాన శిబిరం
VZM : గజపతినగరంలోని సాయి సిద్ధార్థ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరం జరిగింది. కళాశాల ఛైర్మన్ డాక్టర్ ఎస్ పెద్ది నాయుడు, శారదానాయుడు ప్రారంభించిన శిబిరంలో 81 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కళాశాల కరస్పాండెంట్ ఎస్ చంద్రశేఖర్ 48వ సారి రక్తదానంలో పాల్గొన్నారు. విద్యార్థులు అధ్యాపకులు సిబ్బంది రక్తదానం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.