ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్ చోరీకి పాల్పడిన దుండగులు
BDK: కరకగూడెం మండలంలోని మోతే ఫీడర్లలో ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్ చోరీకి గురైనట్లు స్థానికులు ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించి అందులోని కాపర్‌ను దొంగలించినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు స్థానిక పోలీస్ వారికి సమాచారం అందజేసినట్లు తెలిపారు.