నిడదవోలులో విద్యార్థిని మిస్సింగ్ కేసు

నిడదవోలులో విద్యార్థిని మిస్సింగ్ కేసు

తూ.గో: నిడదవోలు మండలంలో 15 ఏళ్ల మైనర్ విద్యార్థిని కనిపించడం లేదని సమీశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందరరావు తెలిపారు. పదో తరగతి పరీక్షకు తాడిమళ్ల హైస్కూల్‌కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి గాలింపు చేపట్టినట్లు గురువారం తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.