'ఉద్యమకారులను గుర్తించి ఆదుకోవాలి'

HYD: తెలంగాణలో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏ ఆశయం కోసం ఉద్యమం చేశామో.. ఆ ఆశయం నెరవేరకపోవడం బాధాకరమని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం చేసిన ఉద్యమ ఆశయం నీరుగారిపోతోందని అన్నారు.