అంబేద్కర్ నినాదాలతో మారుమోగిన నందారం
SDPT: అక్కన్నపేట మండలం నందారం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను యువత ఘనంగా నిర్వహించారు. భారీ ర్యాలీతో గ్రామం మారుమోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సర్పంచ్ సుగుర్తి శ్రీలత, ఉప సర్పంచ్ లింగాల కనుకయ్య హాజరై ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.