ప్రతి 10 లక్షల జనాభాకు 21 మంది జడ్జిలు: కేంద్రం

HYD: దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 21 మంది జడ్జిలు ఉన్నారని కేంద్రం తెలిపింది. దేశంలోని హైకోర్టులలో 368 ఖాళీలు ఉండగా గరిష్ఠంగా అలహాబాద్ హైకోర్టులో 79 ఉన్నాయని వెల్లడించింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సమాధానమిచ్చారు. జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 5,262 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు.