విరుపాక్షి మారెమ్మ‌కు విశేష పూజలు

విరుపాక్షి మారెమ్మ‌కు విశేష పూజలు

CTR: పుంగనూరు ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ విరుపాక్షి మారెమ్మ సోమవారం విశేష పూజలు అందుకుంది. ఉదయం పూర్వమే అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత పసుపుతో పాటు వెండి ఆభరణాలతో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రతిరోజు లాగానే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.