ఢిల్లీ పేలుడు.. తిరుపతిలో పోలీసుల అప్రమత్తం

ఢిల్లీ పేలుడు.. తిరుపతిలో పోలీసుల అప్రమత్తం

AP: ఢిల్లీ పేలుడు ఘటనతో తిరుపతిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్, టీటీడీ వసతిగృహాల్లో తనిఖీలు నిర్వహించారు. అలిపిరి టోల్‌గేట్‌, కాలినడక మార్గం విస్తృతంగా తనిఖీలు చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు బస్టాండ్‌, లాడ్జిల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు గుర్తిస్తే కంట్రోల్‌ రూమ్‌ 112కు సమాచారం ఇవ్వాలన్నారు.