మండల ప్రజలకు విద్యుత్ అధికారులు సూచనలు..

మండల ప్రజలకు విద్యుత్ అధికారులు సూచనలు..

BHPL: కాటారం మండలంలో విద్యుత్ అధికారులు బుధవారం ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. తడిసిన కరెంటు స్తంభాలు, విద్యుత్ లైన్లకు అంటుకున్న చెట్లను ముట్టవద్దని, తడి చేతులతో స్విచ్ బోర్డులను తాకరాదని హెచ్చరించారు. ఉతికిన బట్టలను ఇనుప తీగలపై ఆరవేయడం మానాలన్నారు. ఉరుములు, మెరుపులతో వర్షం పడేటప్పుడు సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు.