VIDEO: పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్: కలెక్టర్

NLR: మే 19నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.