గురు హిరాసుకా లింగో జయంతి కరపత్రాల ఆవిష్కరణ
ADB: రాష్ట్రీయ పర్ధాన్ జనజాతి ఉద్దాన్ సంఘటన్ సంస్థ సభ్యులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 15న నిర్వహించనున్న గోండి ధర్మ గురు హిరాసుకా లింగో జయంతి ఉత్సవాల కరపత్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు యాదవ్ రావు, శంకర్, మాధవ్, తదితరులు ఉన్నారు.