సిద్దిపేటలో చెత్తను బయట పడేస్తే కఠిన చర్యలు

సిద్దిపేటలో చెత్తను బయట పడేస్తే కఠిన చర్యలు

SDPT: సిద్దిపేట పట్టణంలో చెత్తను బహిరంగంగా బయట పడేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రీత్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం ఉదయం ఆయన పలు వార్డులను పరిశీలించారు. 1వ వార్డులోని మురికి కాలువలో చెత్త పేరుకుపోవడాన్ని చూసి కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్లీన్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.