సూర్యాపేట జిల్లాకు ఎల్లో అలర్ట్
SRPT: వాతావరణ శాఖ సూర్యాపేట జిల్లాకు రాబోయే 3 గంటల్లో భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైతులు వరి కుప్పలను, పత్తిని తడవకుండా కప్పి పెట్టుకోవాలని తెలిపారు. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ కే. నరసింహ పేర్కొన్నారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.